Monday, 2 November 2026 · Bengaluru
AdvertisementAdvertisement
World

చైనా విమానయాన రంగానికి ఇంధన సెగ.. మూడు దిగ్గజ సంస్థలకు నష్టాలు

By Chandra Shekhar 1 min read
చైనా విమానయాన రంగానికి ఇంధన సెగ.. మూడు దిగ్గజ సంస్థలకు నష్టాలు

చైనా విమానయాన రంగాన్ని పెరుగుతున్న విమాన ఇంధన ధరలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎయిర్‌ చైనా, చైనా ఈస్టర్న్‌, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు 2026 తొలి తొమ్మిది నెలల్లో నష్టాలను నమోదు చేశాయి. మూడో త్రైమాసికంలో ఎయిర్‌ చైనా లాభం 92.6 శాతం, చైనా ఈస్టర్న్‌ లాభం 98.2 శాతం పడిపోయాయి. చైనా సదరన్‌ ఏకంగా 609 మిలియన్‌ యువాన్ల నష్టాన్ని ప్రకటించింది. ఇరాన్‌ యుద్ధ పరిణామాలతో జెట్‌ ఇంధన ధరలు రెట్టింపునకు పైగా పెరగడం, దేశీయంగా విమాన ఛార్జీలు తగ్గడం, హైస్పీడ్‌ రైళ్లతో పోటీ ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా మారాయి. ఈ ఏడాది మూడు సంస్థల షేర్లు కూడా భారీగా పడిపోయాయి.

China Airlines Losses | ఆంధ్రప్రభ వెబ్‌, బిజినెస్‌ ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన మార్కెట్లలో ఒకటైన చైనాలో విమానయాన రంగం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పెరిగిపోతున్న విమాన ఇంధన ధరలు, దేశీయంగా బలహీనపడిన విమాన ఛార్జీలు, తీవ్ర పోటీ, తుపాన్ల ప్రభావం ఆ దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థల ఆదాయంపై గట్టి దెబ్బకొడుతున్నాయి. ఫలితంగా చైనాకు చెందిన మూడు అతిపెద్ద విమానయాన సంస్థలు ఈ ఏడాది కూడా వార్షిక నష్టాలను నమోదు చేసే దిశగా పయనిస్తున్నాయి. ఎయిర్‌ చైనా, చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్‌.. ఈ మూడు సంస్థలూ 2026 తొలి తొమ్మిది నెలల్లో నష్టాలను ప్రకటించాయి. గత ఏడాది ఇదే కాలంలో లాభాల్లో ఉన్న ఈ సంస్థలు ఇప్పుడు నష్టాల బాట పట్టడం చైనా విమానయాన రంగంలో నెలకొన్న సంక్షోభానికి అద్దం పడుతోంది.

AdvertisementAdvertisement

Comments (0)

Join or log in to comment.

    Related stories